సీఎం నివాస ప్రాంతంలో ఘర్షణ- గంజాయి మత్తులో యువకుడిపై దాడి - గంజాయి మత్తులో యువకుడిపై దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 12:19 PM IST
Clash in CM residence Area Assault on Youth: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీపంలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో ఘర్షణకు పాల్పడ్డారు. తాడేపల్లి ముగ్గు రోడ్డు ప్రాంతంలో ఉంటున్న రౌడీ షీటర్ అనిల్ తన అనుచరులతో గంజాయి సేవించి స్థానిక యువకుడిపై ఆదివారం అర్ధరాత్రి దాడికి దిగారు. దాడిలో యువకుడికి గాయమై 3 కుట్లు పడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా రౌడీ షీటర్ అనిల్ అనుచరుల ఆగడాలు శృతి మించిపోతున్నాయని స్థానికులు తెలిపారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే తమకు రక్షణ లేదంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుందని స్థానికులు అసహనానికి గురవుతున్నారు. యువకుడిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.