ఏపీలోనే అత్యధిక ఎన్నికల వ్యయం- అధికార పార్టీ అక్రమాలకు అంతేలేదు: CFD - Citizens For democracy Kalajatha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 5:07 PM IST
Citizens For democracy Vote Awareness Programme in Ongole : రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓటర్లకు తాయిలాలు పంచుతోందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (Citizens For democracy) ఆధ్వర్యంలో ఓటు వేద్దాం రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమాన్ని ఒంగోలు (Ongole)లో నిర్వహించారు. ప్రజల సొమ్ముతో గౌరవవేతనం పొందుతున్న వాలంటీర్లు ఒక పార్టీకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అధికారపార్టీ అనేక అక్రమ మార్గాల్లో అర్జించిన నగదును ఓటర్లకు తాయిలాలుగా పంచుతున్నారని ఆరోపించారు.
CFD Kalajatha in ongole : దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉందని ధ్వజమెత్తారు. అత్యధిక ఎన్నికల (Elections) వ్యయం ఏపీలోనే జరుగుతుందని ఆరోపించారు. మట్టి మాఫియా, ఇసుక, గంజాయి, మద్యం, గ్రావెల్, అక్రమాలు, అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయని ఇవే ఎన్నికల్లో తాయిలాల మోతకు కారణమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.