లోకేశ్ అరెస్టుకు ఉత్తర్వులు ఇవ్వాలని సీఐడీ వేసిన పిటీషన్‌పై విచారణ వాయిదా - CID FILED PETITION in LOKESH ARREST - CID FILED PETITION IN LOKESH ARREST
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 10:49 AM IST
CID Filed Petition to Lokesh Arrest in ACB Court: సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నిబంధనలను ఉల్లంఘిస్తూ దర్యాప్తు అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అరెస్టుకు ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. పత్రిక సమావేశంలో లోకేశ్ మాట్లాడిన అంశాలకు సంబంధించి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి గత సంవత్సరం 2023 డిసెంబర్ 29న ప్రసారం చేసిన విషయాలతో ఏసీబీ కోర్టులో సీఐడీ ఇటీవల మెమో దాఖలు చేసింది.
CID Petition Adjourned For ACB Court: నోటీసులో పేర్కొన్న షరతులకు లోబడి వ్యవహరించడంలో లోకేశ్ విఫలమయ్యారని సీఐడీ ఆరోపించింది. దీనిపై సోమవారం జరిగిన విచారణలో లోకేశ్ తరఫు న్యాయవాది గూడపాటి లక్ష్మినారాయణ మెమోపై అభ్యంతరం తెలిపారు. సీఐడీ ముందుగా వేసిన పిటిషన్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. సీఐడీ మెమోపై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరడంతో విచారణను ఈనెల 30కి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.