ఫైబర్‌ నెట్‌ కేసు - అభియోగపత్రం దాఖలు చేసిన సీఐడీ - ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 1:28 PM IST

CID filed charge sheet: ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా మరికొందరిపై సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో అభియోగపత్రాన్ని సమర్పించింది. నెట్‌ ఇండియా సంస్థ ఎండీ వేమూరి హరికృష్ణ ప్రసాద్‌, ఏపీఎస్​ఎఫ్​డీఎల్​ ఎండీగా పనిచేసిన ఐ.టీ.ఆర్​.ఎస్​ అధికారి కోగంటి సాంబశివరావును నిందితులుగా పేర్కొంది. 330 కోట్ల రూపాయల విలువైన ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు ఫేజ్‌-1 పనులకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్‌ను నిబంధనలు, టెండర్ ప్రక్రియను ఉల్లంఘించి తమకు అనకూలమైన కంపెనీకి అప్పగించారంటూ అభియోగం మోపింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు 114 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీఐడీ అభియోగ పత్రంలో పేర్కొంది.

Fiber Net case గత ప్రభుత్వ హయంలో పైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ  కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 25వ నిందితుడిగా సీఐడీ పేర్కోంది. నిధులను దుర్వినియోగం చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే విచారణ జరుగుతున్న క్రమంలో దర్యాప్తులో భాగంగా చంద్రబాబును ఏ1గా చేర్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.