'ఇప్పటికైన మారి చావండి'- కుప్పం ప్రజలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు - AP Assembly Elections - AP ASSEMBLY ELECTIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 4:42 PM IST

AP Assembly Elections : వైఎస్సార్సీపీ నాయకులు ఓటమి ఖాయమన్న ఆందోళనలో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల ప్రతిపక్ష టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడగా ఎన్నికల ప్రచారంలోనూ దూషణలకు పాల్పడుతున్నారు. తాజాగా కుప్పం ప్రజానీకాన్ని ఉద్దేశించి అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. 

కుప్పంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్​ 35 ఏళ్లుగా ఎవడో పేమెంట్ చేస్తే ఇన్నాళ్లూ ఊడిగం చేశారని ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఇకనైనా మారి చావండని' ఆయన మాట్లాడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడిన భరత్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు చంద్రబాబుకు కుప్పం ప్రజలు ఊడిగం చేశారని ఇకనైనా మారి చావండని ప్రజల ఉద్దేశించి భరత్ చేసిన వ్యాఖ్యలు తమకు ఆగ్రహం తెప్పిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.