అమెరికా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి - ఘనస్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు - Revanth Reddy America Tour - REVANTH REDDY AMERICA TOUR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2024/640-480-22123799-thumbnail-16x9-telangana.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 4, 2024, 10:54 AM IST
Telangana Chief Minister Revanth Reddy America Tour : రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకురావడమే ధ్యేయంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. న్యూయార్క్‌లో రేవంత్‌రెడ్డి బృందానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్‌లో ఇవాళ ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నట్లు సమాచారం. 11రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించనున్నారు.
ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో వీరు పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఈనెల 14 వరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఆగస్టు 4న మంత్రి శ్రీధర్‌బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరితో పాటుగా సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు అమెరికా వెళ్లనున్నారు.