"మార్చి నెలలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ - ఏర్పాట్లన్ని పూర్తి చేయాలి" - ఎన్నికల ఏర్పాట్లపై ముకేశ్‌కుమార్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-02-2024/640-480-20771504-thumbnail-16x9-chief-electoral-officer-mukesh-kumar-meena.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 10:18 AM IST
Chief Electoral Officer Mukesh Kumar Meena: రాష్ట్రంలో సార్వత్రిక ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం ఎన్నికల పర్వానికి సిద్ధమౌతోంది. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమయ్యాయి. ఏ స్థానంలో ఎవర్ని బరిలో నిలిపితే విజయం సాధిస్తారో అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ తరుణంలో అధికార యంత్రాంగం కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనా ఆదేశించారు.
ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సున్నితమైన పోలింగ్ స్టేషన్లు, చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లు, వెబ్‌క్యాస్టింగ్ సహా పలు అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు వీలుగా చేయాల్సిన ఏర్పాట్లు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. మార్చి నెలలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న దృష్ట్యా వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు జారీచేశారు.