పంట పొలాల్లో చిరుత సంచారం - బెంబేలెత్తుతున్న రైతులు - Cheetah Wandering in Satyasai

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 5:08 PM IST

thumbnail
పంట పొలాల్లో చిరుత సంచారం- బెంబేలెత్తున్న రైతులు (ETV Bharat)

Cheetah Wandering in Satyasai District : సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. పంట పొలాల్లో చిరుత సంచారంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. వ్యవసాయ పనులు చేయలేక ఆందోళన చెందుతున్నారు. మేకలకు మేత కోసం కొండపైకి తీసుకెళ్లలేక పశువుల కాపరులు ఆవేదన చెందుతున్నారు. చిరుతను బంధించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. వన్య ప్రాణులు అధికంగా సంచరించే గుడిబండ ప్రాంతంలో రైతులు, పశువుల కాపరులకు ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు  కోరుతున్నారు.

ఇటీవల పలు జిల్లాల్లో చిరుత సంచారాలు అధికమయ్యాయి. గతంలో నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో చిరుత తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఈ క్రమంలోనే పనికి వెళ్లిన ఓ మహిళపై పులి దాడి చేయగా మృతి చెందిన ఘటన తెలిసిందే. అది మరవక ముందే మరో వ్యక్తిపై చిరుత దాడి హల్​చల్​ చేసింది. తరచూ సీసీ కెమెరాకు చిరుతలు చిక్కుతూనే ఉన్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.