ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్ మోసం - ఓడి ఖాతాలోని రూ. 2 కోట్లు మళ్లింపు - OD AMOUNT DIVERT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 12:29 PM IST
Cheating Case Filed On Field Officer Working in SBI Branch : సత్యసాయి జిల్లా కదిరి ఎస్‌బీఐ (SBI) బ్రాంచ్‌లో పని చేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వ్యవసాయ విభాగంలో పని చేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ వెంకటనాయుడు ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో ఉన్న కోటి 67 లక్షల 84 వేల రూపాయిలను భాను ప్రవీణ్ అనే వ్యక్తి ఖాతాకు (Account) ట్రాన్స్‌ఫర్ చేసి మోసానికి పాల్పడ్డారు.
SBI Checkings : బ్యాంకు ఖాతా తనిఖీలో భాగంగా ఫీల్డ్ ఆఫీసర్ నగదు బదిలీని (Money transfer) గుర్తించిన రీజనల్ మేనేజర్ వెంకటేశ్వర రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు ఫీల్డ్ ఆఫీసర్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2021 జూలై నుంచి కదిరి ఎస్బీఐ వ్యవసాయ శాఖ విభాగంలో వెంకట నాయుడు పని చేస్తున్నారు. ఓడి ఖాతా నుంచి 13 సేవింగ్ ఖాతాలకు సుమారు 2 కోట్ల రూపాయిలను మళ్లించి ఈ మొత్తాన్ని మరో ఖాతాకు బదిలీ చేసుకుని మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.