చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు- యమునోత్రిలో సందడి - Charadham Yatra 2024 - CHARADHAM YATRA 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 4:07 PM IST
Yamunotri Dham Yatra 2024: హిందువులకు పవిత్రమైన యాత్రల్లో చార్దామ్ ఒకటి. ఉత్తరాఖండ్లో ఉన్న చార్ధామ్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మే నెల 10వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు ఈ చార్ధామ్ యాత్ర సాగనున్నట్లు ఇటీవలే ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తుల సౌకర్యాల కోసం ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ చార్ధామ్ యాత్ర కోసం ప్రయాణాన్ని మొదట యమునోత్రి నుంచి ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని టూరిజం శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యమునోత్రిలో యాత్రికుల తాకిడితో సందడి నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణించి యమునోత్రి చేరుకున్న భక్తులను ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. వయసు బేధం లేకుండా అన్ని వర్గాల వారు కాలినడక, గుర్రాలు, పల్లకి, హెలికాప్టర్ మార్గాల ద్వారా యమునోత్రి దేవి దర్శనం చేసుకుంటున్నారు.