'పరదాల మాటున తిరిగేవారికి 986 మంది సెక్యూరిటీ అవసరమా? - మనం ప్రజా సేవకులం మాత్రమే' - Jagan Security - JAGAN SECURITY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2024/640-480-21819659-thumbnail-16x9-cbn-security-jagan-security.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 7:38 PM IST
Chandrababu on Jagan Security : తాను ముఖ్యమంత్రినే అయినా ముందుగా ప్రజాసేవకుడిని అని చంద్రబాబు చెప్పారు. ప్రజా సేవకులుగానే కొనసాగాలని మంత్రులకు స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ భద్రత విషయమై మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రికి 986 మంది సెక్యూరిటీ అవసరమా? అది కూడా పరదాల మాటున తిరిగేవాళ్లకి సెక్యూరిటీ అంతగా సెక్యూరిటీ అవసరమా? కొంత మంది అధికారులకు కూడా అలవాటైపోయింది. నా పర్యటనలో కూడా పరదాలు కట్టే ప్రయత్నం చేస్తుంటే వారించాను. ఎక్కడా చెట్లు కొట్టొద్దని స్పష్టంగా అదేశాలు జారీ చేశాం. ఆలస్యమైనా పర్వాలేదు. ట్రాఫిక్ ఎక్కడా కూడా నిలిపివేయొద్దని చెప్పాను. నేనే కాదు మా మంత్రులకు కూడా ప్రజా సేవకులుగా పని చేయాలని చెప్పాను. రాజకీయ నేరస్తులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రతా అని ఆయన నిలదీశారు. తాను వచ్చినప్పుడు పరదాలు కడితే తీయించానని తెలిపారు. తన పర్యటనలో అవసరమైన మేర మాత్రమే ట్రాఫిక్ ఆపమని స్పష్టం చేశానన్నారు. ఎలాంటి ఆర్భాటాలు వద్దని మంత్రులకు కూడా స్పష్టం చేశానని ముఖ్యమంత్రి తెలిపారు.