LIVE: నెల్లూరు జిల్లా కోవూరులో చంద్రబాబు ప్రజాగళం - ప్రత్యక్షప్రసారం - CBN LIVE - CBN LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 7:20 PM IST

Updated : Apr 27, 2024, 8:55 PM IST

Chandrababu Public Meeting Live in Kovur of nellore district : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూకుడు పెంచింది. ఎన్డీఏ నేతలు ఇప్పటికే భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు, పరిపాలన చేతకాక జనాన్ని నట్టేట ముంచేసిన దుర్మార్గుడు జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి, వైఎస్సార్సీపీని భూస్థాపితం చేస్తానని చంద్రబాబు తెలిపారు.జనం కూడా జగన్ ను ఓడించి, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజల గుండెల్లో స్థానమే తన ఆశయమన్న చంద్రబాబు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల కోసం పని చేశానని అన్నారు. ఆడపిల్లలను చదివిస్తే ఆర్థికాభివృద్ధి సాధిస్తారని, తెలుగుజాతి నెంబర్‌వన్‌గా నిలపాలన్నది తన లక్ష్యం అని పేర్కొన్నారు. మహిళలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 27, 2024, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.