ఫిర్యాదు చేస్తే, దాడులకు తెగబడతారా?: చంద్రబాబు - TDP MLA Candidate Madhavi Reddy
🎬 Watch Now: Feature Video
Chandrababu Condemned YSRCP Leaders Attack: కడప తెలుగుదేశం అభ్యర్థి మాధవి రెడ్డిపై గన్నవరంలో వైసీపీ మూకల దాడి చేసిన ఘటనను ఖండిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలను ఫిర్యాదు చేస్తే, దాడులకు తెగబడతారా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు మాధవి రెడ్డి ఫోటోలు తీస్తుంటే బెదిరించి దాడికి తెగబడిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన మహిళా నేతపై దాడిని అడ్డుకోకపోగా, పైగా మాధవిరెడ్డినే పోలీస్ స్టేషన్కు రావాలంటూ, పోలీసులు ఒత్తిడి చేయడం పై ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది: కడప టీడీపీ అభ్యర్థి మాధవి శనివారం వర్క్ షాప్లో పాల్గొనేందుకు కడప నుంచి గన్నవరానికి విమానంలో వచ్చారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి మాధవి కారులో వెళ్తుండగా మార్గమధ్యలో సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు కనిపించాయి. దీంతో ఆమె ఆగి ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఆమె కారు దిగి ఫొటోలు తీయడం గమనించిన వైసీపీ శ్రేణులు ఆమెపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.