పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ ముఠా - కారులో వెళ్తున్న యువకుడిపై దాడి చేసి బంగారం చోరీ - Rajendra Nagar chain snatching case - RAJENDRA NAGAR CHAIN SNATCHING CASE
🎬 Watch Now: Feature Video
Published : Mar 31, 2024, 9:44 PM IST
Chain Snatching Issue in Hyderabad : హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లో పట్టపగలే నడి రోడ్డుపై దోపిడీ ముఠా సభ్యులు రెచ్చిపోయారు. ఉప్పర్‌పల్లి చౌరస్తాలో కారులో పయనిస్తున్న యువకుడిని ఐదుగురు వెంబడించి, మెట్రో పిల్లర్ వద్ద కారు టర్నింగ్ చేస్తుండగా హెల్మెట్‌తో దాడి చేశారు. యువకుడిని చితకబాది, 10 తులాల బంగారు గొలుసుని లాగే ప్రయత్నం చేయగా 4 తులాల గొలుసు చేతికి చిక్కడంతో దొంగిలించి పరారయ్యారు. పట్టపగలే దొంగలు రెచ్చిపోవడంతో వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు చైన్ స్నాచర్‌ల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Chain Snatch at Ameenpur : ఈ మధ్య కాలంలో రహదారుల వెంబడి జరుగుతున్న ఈ చోరీలు మరింత అలజడిని రేకెత్తిస్తున్నాయి. గత నెలలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సైతం వాహనంపై ప్రయాణిస్తుండగా చోరీకు గురైన రెండు ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగించాయి. మహిళల మెడలోని గొలుసును దొంగలించడంతో, ఆ రహదారి వెంబడి మహిళలు వెళ్లాలంటే భయపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.