ప్రపంచాన్ని శాసించే స్థాయిలో భారతదేశం : కేంద్రమంత్రి రిజిజు - సైనోప్స్ ప్రారంభించి మంత్రి రిజిజు
🎬 Watch Now: Feature Video
Published : Feb 15, 2024, 3:11 PM IST
Central Minister Kiren Rijiju Visits Incois Centre : శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్లోని ఇన్‌కాయిస్ (Incois) ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో నూతనంగా ఏర్పాటు చేసిన సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సర్వీసెస్(SYNOPS) విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఇన్‌కాయిస్ శాస్త్రవేత్తలు పాతికేళ్లుగా ఎన్నో పరిశోధనలు చేసి మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం దిక్సూచిగా నిలిచారని ప్రశంసించారు.
India Leading World In Science Technology : దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో ఇన్‌కాయిస్ సేవలందించడం అభినందనీయం అని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్లో జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలోని రాకెట్ల నమూనాతో కూడిన రాడార్లను పరిశీలించి భూగోళ నమూనా ద్వారా సముద్ర స్థితిగతులను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇన్‌కాయిస్ మనదేశానికి గర్వకారణమన్న ఆయన హైదరాబాద్ నగరంలో ఇన్‌కాయిస్ అభివృద్ధికి సరైన ప్రాంతమన్నారు. ఈ సందర్భంగా ఇన్‌కాయిస్ ప్రతినిధులను ఆయన అభినందించారు.