శ్రీవారి సేవలో ప్రముఖులు- దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు - Celebrities Visited Tirumala - CELEBRITIES VISITED TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2024, 5:08 PM IST
Celebrities Visited Tirumala Srivara : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. క్రికెటర్ ఉమేష్ యాదవ్ కుటుంబం, రచయిత రామజోగయ్య శాస్త్రి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వైకుంఠనాథున్ని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వెంకన్న సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Srivari Salakatla Brahmotsavam 2024 : మరోవైపు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ వైద్య విభాగం చర్యలు చేపడుతోంది. నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో శాశ్వతంగా 6 డిస్పెన్సరీలు, 6 ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఉద్యోగులు, స్థానికులకు తితిదే వైద్య సేవలు అందిస్తోంది. టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్‌లను సిద్ధం చేస్తున్నారు.