రామోజీరావు సంస్మరణ సభ - తరలివస్తున్న ప్రముఖులు - RAMOJIRAO MEMORIAL PROGRAMME

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 1:27 PM IST

Celebrities at Ramoji Rao Memorial Programme : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఈ రోజు నిర్వహించనుంది. ఇందుకోసం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, పాత్రికేయ దిగ్గజాలు ఎన్‌.రామ్, శేఖర్‌ గుప్తా తదితరులు హాజరుకానున్నారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆశీనులుకానున్నారు. ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

సభకు హాజరయ్యేందుకు ప్రముఖులంతా చేరుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరానికి మీడియా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వచ్చారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు రాఘవేంద్రరావు, రాజస్థాన్ పత్రికా ఎడిటర్ గులాబ్ కొఠారి సహా ఇతర అతిథులకు విమానాశ్రయంలో ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథులు రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. 

రామోజీరావు సంస్మరణ సభను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. విజయవాడలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.