'మంత్రి వాహనాన్నే అడ్డుకుంటారా' - 12మంది అంగన్​వాడీలపై కేసు - andhra pradesh

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 4:55 PM IST

Case Registered on Anganwadi Workers: హక్కుల కోసం గళమెత్తిన అంగన్వాడీలను అణచివేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరసనకు దిగిన వారిపై కేసుల కత్తి దూస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన 12 మంది అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని అడ్డుకోవడంపై కేసు పెట్టారు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఉరవకొండ తహసీల్దార్ చేసిన ఫిర్యాదుతో ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని శనివారం అంగన్వాడీలు అడ్డుకున్నారు. మంత్రి వాహనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈనెల 23న ఉరవకొండలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అంగన్వాడీలు అడ్డుకోవడంతో దాదాపు అరగంటపాటు ఆయన రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను పక్కకు లాగేసి మంత్రి కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. తాజాగా మంత్రిని అడ్డుకున్న అంగన్వాడీలపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.