వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు - Case Against YSRCP MLC Bharath - CASE AGAINST YSRCP MLC BHARATH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 4:09 PM IST
Case Against YSRCP MLC Bharath : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదైెంది. తిరుమలలో తోమాల సేవ పేరిట ఆయన సిఫారసు లేఖ అమ్మినట్లు టీడీపీ నేత చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరు వాసుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ సిఫారసు లేఖల అమ్మకంపై ఆయన గుంటూరు అరండల్పేట పోలీస్స్టేషన్లో ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేశారు. భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు నమోదు చేసిన అరండల్పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత ఎన్నికల్లో కుప్పం నుంచిచంద్రబాబుపై భరత్ పోటీ చేసి ఓడిపోయారు.
Case Filed MLC Bharath : కుప్పంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ భరత్ చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఆయన ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఇప్పుడు తాజాగా భరత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.