జాతీయ రహదారిపై కారు దగ్ధం, ముగ్గురికి తప్పిన ముప్పు - జాతీయ రహదారిపై కారు దగ్ధం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2024/640-480-20645880-thumbnail-16x9-car-caught-fire-on-vijayawada-machilipatnam-national-highway.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 8:38 AM IST
Car Caught Fire on Vijayawada-Machilipatnam National Highway: ప్రయాణిస్తున్న కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన గురువారం రాత్రి పామర్రు మండలం కురుమద్దాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుడివాడకి చెందిన టాటా హేరియర్ కారులో ముగ్గురు ప్రయాణికులు భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఇంజన్‌లో నుంచి మంటలు వ్యాపించాయి. విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కురుమద్దాలి వద్దకు వచ్చే సరికి కారులో నుంచి కాలిన వాసన వస్తుండటంతో వెంటనే అందులో ప్రయాణిస్తున్న వారు రోడ్డు పక్కన కారును నిలిపారు. అప్పటికే మంటలు వ్యాపిస్తున్నాయి. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేశారు.
విషయం తెలిసిన వెంటనే పామర్రు పోలీసులు, ఉయ్యూరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.