కాకినాడలో కారు బీభత్సం- ఇద్దరు మృతి - Car Accident - CAR ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 11:54 AM IST
Car Accident Two Persons Dead in Kakinada District : కాకినాడలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. కల్పనా సెంటర్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి బైక్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలవ్వడంతో వారిని జీజీహెచ్ కు తరలించారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి కల్పనా సెంటర్ వైపు కారు దూసుకు వచ్చిందని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. కారులో నుంచి మద్యం సీసా బయట పడగా కార్లలో మరికొన్ని మద్యం సీసాలు ఉన్నాయని పేర్కొన్నారు. మద్యం సేవించి అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన ఇద్దరిలో ఒకరు పేర్రాజుపేటకు చెందిన సతీష్‌గా (35) గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.