కూటమి పాలనలో రాజధానికి మళ్లీ పూర్వవైభవం: అమరావతి రైతులు - Farmers Happy for Funds Allocate - FARMERS HAPPY FOR FUNDS ALLOCATE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 3:40 PM IST
Capital Farmers Happy About Allocation of Funds to Amaravati : కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి 15 వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయం ప్రకటించడంపై రాజధాని రైతులు, మహిళలు స్వాగతించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం వేగంగా జరగనుందని రైతులు ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి ఇప్పుడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల సారథ్యంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని రైతులు తెలిపారు. కూటమి పాలనలో అమరావతికి మళ్లీ పూర్వవైభవం వస్తుందని రైతులు అంటున్నారు.
ఆంధ్రులంతా గర్వపడేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే చెప్పి అమరావతిని పట్టించుకోలేదని రైతులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించటంపై మహిళలు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి నిర్వహించారు.