చంద్రబాబు సీఎం కావాలని వినూత్న ప్రార్థన - ఇసుకలో మోకాళ్లపై నడిచిన యువకులు - Amaravati farmer prayer for CBN - AMARAVATI FARMER PRAYER FOR CBN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-05-2024/640-480-21578920-thumbnail-16x9-amaravati-farmer-prayer-for-cbn.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 28, 2024, 4:48 PM IST
Amaravati Farmers Prayer for Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుతూ రాజధాని అమరావతికి చెందిన యువ రైతులు వినూత్న రీతిలో ప్రార్థనలు నిర్వహించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలానికి చెందిన పులి చిన్నతో పాటు మరికొంతమంది రైతులు తమిళనాడులోని వేళాంగిణి మాతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజయం సాధించాలని ముడుపులు కట్టారు. చంద్రబాబు కోసం ఎర్రని ఎండలో మోకాళ్లపై ఆలయం వరకు ఇసుకలో నడిచారు. అమరావతి బతకాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు.
గతంలోనూ చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని రైతు పులి చిన్న చాటుకున్నారు. గతంలో వినూత్న రీతిలో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సముద్రమట్టానికి 16,676 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ మార్గ మధ్యలోని నాగర్శంగ్ పర్వతంపై చంద్రబాబు చిత్రపటాన్ని ఎగురవేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు తీసుకెళ్లాలని పులిచిన్నా ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ మోకాళ్లపై నడిచి వెళ్లి వేలాంగిణిమాతను దర్శించుకున్నారు.