హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్ల ఇబ్బందులు- మంత్రి లోకేశ్‌కు వినతి - CAB DRIVERS problems - CAB DRIVERS PROBLEMS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 12:37 PM IST
Cab Drivers Request to Lokesh in Praja Darbar : తమ సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణలో పని చేస్తున్న ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ప్రజా దర్బార్‌లో మంత్రి లోకేశ్‌ను కలిసి విన్నవించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగియడంతో వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మళ్లీ చెల్లించాలని తెలంగాణ సర్కార్ నిబంధనలు విధించిందని వాపోయారు. మరోసారి లైఫ్ ట్యాక్స్ చెల్లించడం ఆర్ధికంగా తీవ్ర నష్టమంటూ డ్రైవర్లు మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందచేశారు.
హైదరాబాద్‌లో ఏపీ వాహనాలు తిరగకుండా అక్కడి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని లోకల్ డ్రైవర్లు కూడా తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. ఈనెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్న వేళ తమ సమస్య పరిష్కరించేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో తమకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ ప్రజా దర్బార్ వేదికగా మంత్రి లోకేశ్‌కు వినతి పత్రం అందజేశారు.