సినీ తారల సందడితో ఏఓబిలో అభిమానుల కోలాహలం - BUZZING OF CINE STARS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2024, 2:44 PM IST

Buzzing of Cine Stars In Andhra-Odisha Borders : ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సినీతారలు సందడి చేశారు. కోరాపుట్‌ జిల్లాలో నటులు జగపతిబాబు, సలార్‌ విలన్‌ జానీ విజయ్‌, నాని సందడి చేశారు. అనుష్క కథాయనాయికగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్‌లో భాగంగా ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని పర్యటించారు. ఏఓబీలోని లమతపుట్‌, ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం, వించ్‌హౌస్‌, వ్యూపాయింట్‌ తదితర ప్రాంతాల్లో పలు సన్నివేశాలను చిత్రికరించారు. సినీనటులను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

Actors Involved in Shooting in Duduma Waterfalls : ప్రతి ఒక్కరూ కేరళ, గోవా, తమిళనాడు హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్రంలో అందనమైన ప్రదేశాలు ఉన్నాయని చెబుతూ ఉంటారని, ఒక్కసారి వారందరూ ఒరిస్సాకు వచ్చి చూడాలని నటుడు జాన్‌విజయ్‌ పిలుపునిచ్చారు. డుడుమా జలపాతం చాలా అద్భతామని నటుడు నాని పేర్కొన్నారు. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.