ఆర్టీసీ బస్సు బీభత్సం - నలుగురికి తీవ్ర గాయాలు - నిలిచిపోయిన ట్రాఫిక్ - Bus Accident in Suraram - BUS ACCIDENT IN SURARAM
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 8:02 PM IST
Bus Accident in Suraram Due to Negligence of the Driver : డ్రైవర్ నిర్లక్యం కారణంగా ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీడిమెట్ల డిపోనకు చెందిన బస్సు గండి మైసమ్మ నుంచి సికింద్రాబాద్ వెళుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి.
దీంతో బహదూర్‌పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. సరిగా నిద్ర లేకపోవడం, అతి వేగం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండాపోతోంది.