జోరుగా ఉగాది సంబురాలు - ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎడ్ల బండ్ల పోటీలు - Bullock Cart Race - BULLOCK CART RACE
🎬 Watch Now: Feature Video
Published : Apr 9, 2024, 3:33 PM IST
Bullock Cart Race in Nalgonda : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉగాది సంబురాలు అంబరంగా జరిగాయి. మోత్కూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎడ్ల బండ్లు, వాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో అమ్మాయిలు సైతం పాల్గొన్నారు. జోష్‌గా ఎడ్లను తోలుతూ పోటీలకు హాజరయ్యారు. బైక్‌లు, ట్రాక్టర్లు, ఆటోలు నడిపే వారు కూడా పోటీలో ఉన్నారు. మహిళలు సైతం బోనాలు ఎత్తుకుని వచ్చారు. ఎడ్ల బండ్ల ప్రదర్శనను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సామాన్యంగా ఉగాది అనగానే అందరికీ పచ్చడి, పోలెలు (బొబ్బట్లు) గుర్తుకువస్తాయి. సంప్రదాయ బద్దంగా, ప్రశాంతంగా ఉగాది పండుగ జరుపుకుంటారు. ఏడాదంతా మంచి జరగాలని దేవుడికి పూజలు చేస్తారు. ఆలయాలకు వెళ్తారు. వివిధ రకాల నైవేద్యాలు చేసి భగవంతుడికి సమర్పిస్తారు. పంచాగం చూపించుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారు. కొన్ని గ్రామాల్లో మాత్రం ఇలా ఎడ్ల బండ్ల పోటీలు మొదలైనవి నిర్వహిస్తుంటారు.