తెలుగు జాతి ఉన్నంత కాలం రామోజీరావు గుర్తుంటారు : కేటీఆర్​ - KTR Harish rao On Ramoji Rao Demise - KTR HARISH RAO ON RAMOJI RAO DEMISE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 2:09 PM IST

KTR Harish rao On Ramoji Rao Demise : తెలుగు పత్రికారంగంలో, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడు రామోజీరావని మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా ఆయన చిరకాలం నిలిచిపోతారని తెలిపారు. రాష్ట్రం బాగుండాలని ఆయన కోరుకునే వారని గుర్తుచేసుకున్నారు. ఆయన 'మొబైల్​ ఎన్​సైక్లోపీడియో' లాంటివారని కేటీఆర్​ అభివర్ణంచారు. రామోజీరావు చాలా దార్శనికులని​ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలుగు భాష ఉన్నంతకాలం ప్రజలు ఆయనని గుర్తుపెట్టుకుంటారని అభిప్రాయపడ్డారు.  

తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను : రామోజీరావు మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి హరీశ్​ రావు తెలిపారు. ఆయన మృతి యావత్​ తెలుగు ప్రపంచానికి, మొత్తం దేశానికి లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని చాటిచెట్టి నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని హరీశ్​రావు కొనియాడారు. మీడియారంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి అని ఆయనని కీర్తించారు. దేశంలోనే గొప్ప ఫిల్మ్​సిటీని నిర్మించి ఈ ప్రాంతం అభివృద్ధిలో ఆయన చాలా కృషి చేశారన్నారు. తెలుగు భాష పరిరక్షణకు ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.