రోడ్డు పక్కన పకోడీలు తిని, చాయ్ తాగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ - ఎక్కడంటే? - KCR Chai Break During Roadshow - KCR CHAI BREAK DURING ROADSHOW
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 9:27 PM IST
KCR Chai Break During Roadshow : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కాసేపు ఆగారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డికి బయలుదేరిన ఆయన టోల్ ప్లాజా సమీపంలోని ఓ టీకొట్టు వద్ద ఆగి అక్కడ పకోడీలు తిని టీ తాగారు. కేసీఆర్ను చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ నాయకులు పెద్దఎత్తున అక్కడికి తరలి వచ్చారు. వారితో కాసేపు ముచ్చటించి ఫోటోలు దిగారు. తమ అభిమాన నేతను అలా చూసేసరికి చాలామంది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం కేసీఆర్ ఆయన కామారెడ్డికి బయలుదేరారు. కేసీఆర్ వెంట ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బీఆర్ఎస్ గతంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు.