కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు కానీ ఉన్నవి ఊడ్చుకుపోతుంది : హరీశ్‌రావు - Harish Rao On Siddipet Flexi Issue - HARISH RAO ON SIDDIPET FLEXI ISSUE
🎬 Watch Now: Feature Video


Published : Aug 17, 2024, 10:11 PM IST
|Updated : Aug 17, 2024, 10:20 PM IST
Harish Rao Respond On Siddipet Flexi Issue : తన ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట ప్రజలకు సేవచేస్తాను కానీ హాని ఎరుగనని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. పట్టణంలోని ఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ, 10వ తరగతి మండల టాపర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీశ్‌రావు హాజరై, మాట్లాడారు. ఈ క్రమంలోనే సిద్దిపేటలో శుక్రవారం జరిగిన సంఘటనపై స్పందించిన మాజీ మంత్రి, ఇన్నాళ్ల సిద్దిపేట చరిత్రలో శుక్రవారం నాటి సంఘటన ఏనాడైనా జరిగిందా అని ప్రశ్నించారు.
నేటి కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలు, ఏ రకంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై పెద్దలంతా ఆలోచించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జిల్లా కీర్తి ప్రతిష్ఠలను పెంచామని తెలిపిన హరీశ్‌రావు, సిద్దిపేట అభివృద్ధి ఎలా చేయాలో తాను ఆలోచించానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది ఏమీలేదు కానీ ఉన్నవి తీసుకుపోతున్నారని విమర్శించారు. రూ.150 కోట్లతో వెటర్నరీ కాలేజీ తాను మంజూరు చేస్తే, దాన్ని రద్దు చేసి సిద్దిపేటకు వచ్చిన అభివృద్ధి పనులను కొడంగల్‌కు తరలించుకుపోయారని ధ్వజమెత్తారు.