సీఎం సాబ్ - క్రికెట్ మ్యాచ్‌లే కాదు - రైతుల కష్టాలూ చూడండి : ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 6, 2024, 2:12 PM IST
BRS MLA Kalvakuntla Sanjay Comments On CM Revanth : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్ చూసినా పర్వాలేదు కానీ, రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని చూసి రైతులను ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జాతీయ రహదారి పక్కన పాత బస్టాండ్ వద్ద రైతు దీక్షను నిర్వహించారు. ప్లకార్డులను చేత పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
BRS Rythu Deeksha In Telangana : సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కనిపించకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేల పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు సాగునీటి కోసం కొట్టుమిట్టాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలపై దృష్టి పెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరపున మేము కూడా సాయం చేయడానికి ముందున్నామని సూచించారు.