LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS Leaders Press Meet Live
🎬 Watch Now: Feature Video
BRS Leaders Press Meet Live : కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడారు. ఇటీవల మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌లో చేరినట్లు వివరించారు. కాగా ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సంజయ్‌ను ఎన్నికల్లో గెలిపించారు. కానీ ఆయన ఉన్నట్టుండి కాంగ్రెస్ చేరారు. పార్టీ ఫిరాయింపులతో బీఆర్‌ఎస్ బలహీనపడుతుంది. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ సాధారణంగా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2004 నుంచి 2006 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో ఫిరాయింపులు జరిగాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమం ఉద్ధృతం చేయడం ద్వారా తెలంగాణ గట్టిగా ప్రతి స్పందించిందని స్పష్టం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. చరిత్ర పునరావృతం అవుతుందని తెలిపారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న వేళ ఈ మేరకు కేటీఆర్ "ఎక్స్" వేదికగా స్పందించారు.
Last Updated : Jun 24, 2024, 1:28 PM IST