LIVE : పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు - brs leaders met governor - BRS LEADERS MET GOVERNOR
🎬 Watch Now: Feature Video
Published : Jul 20, 2024, 12:52 PM IST
పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలను భారత రాష్ట్ర సమితి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. ఇవాళ పార్టీ బృందం కేటీఆర్ నాయకత్వంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసింది. పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాలని గులాబీ పార్టీ నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే శాసనసభాపతి ప్రసాద్ కుమార్ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ పోరాడుతోంది. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ భేటీలో పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లినట్లు గులాబీ నేతలు తెలిపారు. కొత్త గవర్నర్‌గా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఆయనను బీఆర్ఎస్ నేతలు కలవడం ఇదే తొలిసారి. కేటీఆర్‌తో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో పార్టీ నేతలు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.