LIVE : సిద్దిపేటలో హరీశ్‌రావు రోడ్ షో - Harishrao Press Meet at siddipet - HARISHRAO PRESS MEET AT SIDDIPET
🎬 Watch Now: Feature Video
Published : May 1, 2024, 7:46 PM IST
|Updated : May 1, 2024, 8:03 PM IST
BRS Leader Harishrao Press Meet : లోక్‌సభ ఎన్నికల వేడి రోజురోజుకీ వేసవి వేడిని అధిగమించేస్తోంది. ఒకవైపు అభ్యర్థుల ప్రచారాలు, మరోవైపు పార్టీల స్టార్ క్యాంపెయినర్స్, ఇంకోవైపు నేతల ఇంటింటి ప్రచారాలతో తెలంగాణ రాజకీయ రణ రంగంగా మారిపోయింది. ఈ లోక్‌సభ ఎన్నికలు చావోరేవో అన్నట్లు ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీనే లోక్‌సభ ఎన్నికలో గెలిపించాలని పార్టీల నాయకులు వేడుకుంటున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌పై ఈసీ 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించడంపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతామని భావించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఇలా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తప్పించిందని విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటైనని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Last Updated : May 1, 2024, 8:03 PM IST