LIVE : తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియా సమావేశం - BRS LEADER HARISH RAO LIVE TODAY - BRS LEADER HARISH RAO LIVE TODAY
🎬 Watch Now: Feature Video
Published : Sep 15, 2024, 7:13 PM IST
|Updated : Sep 15, 2024, 7:30 PM IST
Harish Rao Slams CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా దుయ్యబట్టారు. సీఎం అబద్ధపు ప్రచారానికి తెరలేపుతున్నారని విమర్శించారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా? అని నిలదీశారు. మరోవైపు రెండు లక్షల వరకు ఉన్న రైతుల ఖాతాల్లోనే ఇంకా డబ్బులు జమకాలేదంటే, ఇప్పుడు సరికొత్త నాటకానికి తెరలేపుతున్నారని, రెండు లక్షల రూపాయాలకు పైన ఉన్న రుణాలకు మించి ఉన్న సొమ్మును ముందుగా చెల్లించమనటం సిగ్గుచేటన్నారు. రుణమాఫీపై ప్రశ్నించినందుకు, వరదలపై నిలదీసినందుకు, ఇప్పుడు ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లినందుకు ఇలా ప్రభుత్వంపై నిరసన గళం ఎత్తిన ప్రతిసారి ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఇవాళ ముఖ్యమంత్రి స్పందించన తీరు, చాలా దౌర్భాగ్యమని వాళ్లను ప్రోత్సహించేలా మాట్లాడిన మాటలు రాజకీయంగా హీనమని వ్యాఖ్యానించారు.
Last Updated : Sep 15, 2024, 7:30 PM IST