LIVE : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - BRS Leaders Press Meet Live - BRS LEADERS PRESS MEET LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 11:27 AM IST

Updated : Jun 18, 2024, 11:48 AM IST

BRS Leaders Press Meet In Telangana Bhavan Live : బీఆర్‌ఎస్‌ పాలనపై నిందలు వేయడానికే కమిటీలు ఏర్పాటు చేసి అనవసరమైన విషయాలపై విచారణలో చేపడుతున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. రాష్ట్ర అవసరాల మేరకే ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. గత కేసీఆర్ సర్కార్​లో రాష్ట్రం ప్రశాంతంగా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే రాష్ట్రంలో అల్లర్లు మొదలయ్యాయని విమర్శించారు. ఈ ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైందని మండిపడ్డారు. మెదక్​లో అల్లర్లపై తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల అంశంపైనా హరీశ్ రావు మాట్లాడారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ చేపడుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్​కు నోటీసులు ఇచ్చి హాజరు కాకముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత ప్రభుత్వంపై అబాంఢాలు వేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే జస్టిస్ నరసింహారెడ్డి విచారణ నుంచి స్వచ్ఛందగా వైదొలగాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Last Updated : Jun 18, 2024, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.