LIVE : మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో - kcr live from mahabubnagar - KCR LIVE FROM MAHABUBNAGAR
🎬 Watch Now: Feature Video
Published : Apr 26, 2024, 7:48 PM IST
|Updated : Apr 26, 2024, 8:33 PM IST
బీఆర్ఎస్ అధినేత కేసీయార్ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోని గడియారం కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతున్నారు. ఈ కార్నర్ మీటింగ్ తర్వాత వన్ టౌన్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఫామ్స్ వరకు ర్యాలీ చేపట్టారు. రాత్రి అక్కడే కేసీఆర్ బస చేయనున్నారు. కేసీఆర్ పర్యటన ద్వారా ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలపైనా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. మహబూబ్‌నగర్‌లో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ కేటాయించగా, నాగర్ కర్నూల్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను బరిలో నిలిపింది. ఈ అభ్యర్థుల ప్రచారానికి కేసీఆర్ స్వయంగా వస్తుండటంతో ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. పదేళ్లలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయనపై ప్రధానంగా విమర్శలు ఎక్కుపెట్టారు.
Last Updated : Apr 26, 2024, 8:33 PM IST