ఉమ్మడి సభతో తాడేపల్లి ప్యాలేస్‌కు బీటలు పడ్డాయి: బొండా ఉమా

🎬 Watch Now: Feature Video

thumbnail

Bonda Said YCP Leaders Spreading False News Against Joint Sabha: పల్నాడు జిల్లా బొప్పూడిలో నిర్వహించిన ఉమ్మడి సభపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా ధ్వజమెత్తారు. ప్రజాగళం సభ జన సునామీని తలపించిందన్నారు. సభా ప్రంగణమంతా జన సంద్రంతో నిండిపోయిందన్నారు. పోలవరం పనులు 72 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే అని బొండా మరోసారి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సభకు పోలీసులు కనీస భద్రతా సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆయన మండిపడ్డారు. 

దేశ ప్రధాని వచ్చిన సభకు ఏ ఆటంకం కలిగించకుండా సజావుగా జరిగేలా చూడాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా అని ఆయన నిలదీశారు. ఈ ఐదు సంవత్సరాలలో జగన్​ చేసిన అవినీతి ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తేనే అర్థమవుతోందని ప్రధాని అనడంతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఆయన ఆక్షేపించారు. సభ విజయవంతం కావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభతో తాడేపల్లి ప్యాలేస్‌కు బీటలు పడ్డాయని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.