చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ - BJP State Incharge met Chandrababu - BJP STATE INCHARGE MET CHANDRABABU
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-06-2024/640-480-21633860-thumbnail-16x9-ap-elections-2024.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 3:48 PM IST
BJP State Incharge Siddharth Nath Singh met Chandrababu: ఏపీలో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ విలవిల్లాడుతుండగా కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో 161 స్థానాల్లో మెజార్టీలో దూసుకెళ్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేయడంపై పలువురు నేతలు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసం వద్ద బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. మరికొద్ది సేపట్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు.
టీడీపీ శ్రేణుల సంబరాలు: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కార్యాలయం గేటు ముందు టపాసులు కాల్చి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నివాసం వద్ద తెలుగుదేశం శ్రేణులు టపాసులు కాల్చారు. రెండు చోట్లా సంబరాలు అంబరాన్ని అంటాయి.