దేశానికే కాదు ప్రపంచానికే ప్రధాని మోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు : ఎంపీ లక్ష్మణ్ - Laxman Fires on Congress - LAXMAN FIRES ON CONGRESS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-04-2024/640-480-21305680-thumbnail-16x9-bjp.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 24, 2024, 7:15 PM IST
Laxman Comments on CM Revanth : దేశానికే కాదు ప్రపంచానికే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. మోదీ ముందు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎవరూ కూడా సాటిరారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాముడిని ఎన్నికల ప్రచారంలోకి లాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అభద్రత భావం, ఓటమి నైరాశ్యంతో పరస్పర అబద్ధపు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్‌లకు గండి కొట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతపరమైన రిజర్వేషన్‌లు కల్పించిందని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు లౌకిక వాదం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సీఎం రేవంత్ రైతు రుణమాఫీ చేస్తామని దేవుడిపై ప్రమాణం చేస్తున్నారని, దేవుళ్లను రాజకీయాల్లోకి తీసుకొస్తుందని ఏ పార్టీనో ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన పరిస్థితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వస్తుందని జ్యోసం చెప్పారు.