విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేయండి- కేంద్రమంత్రికి బీజేపీ ఎంపీల వినతి - visakha steel plant issue - VISAKHA STEEL PLANT ISSUE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 8:15 PM IST
BJP MPs Met Union Minister Kumaraswamy: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రమంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రమంత్రిని కలిసి ఎంపీలు చర్చించారు. స్టీల్‌ప్లాంట్‌ను లాభాలబాట పట్టించే ప్రణాళికను కేంద్రమంత్రికి ఇచ్చినట్లు ఎంపీలు వెల్లడించారు. బీజేపీ ఎంపీల ప్రతిపాదనకు కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు ప్రకటించారు. గతంలో కూడా విశాఖ ఉక్కు వ్యవహారంపై ఇచ్చిన వినతుల ఆధారంగా అధికారులతో చర్చలు జరిపినట్లు కుమారస్వామి చెప్పినట్లు బీజేపీ ఎంపీలు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఎంపీలు వివరించారు. అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఇదే విషయంపై రెండు నెలల్లో మరోమారు చర్చిద్దామని కేంద్రమంత్రి చెప్పినట్లు ఎంపీలు తెలిపారు.
"విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కేంద్రమంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశాం. ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరాం. మా ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి కుమార స్వామి సానుకూలంగా స్పందించారు." - రాష్ట్ర బీజేపీ ఎంపీలు