'ప్రధాని అవుతానని కలలుకన్న రాహుల్ - ఆశ తీరకపోయే సరికి వ్యవస్థలను అప్రతిష్ఠ పాలు చేస్తున్నారు' - MP Raghunandan Rao on Adani Issue - MP RAGHUNANDAN RAO ON ADANI ISSUE
🎬 Watch Now: Feature Video
Published : Aug 22, 2024, 7:42 PM IST
MP Raghunandan Rao on Congress : రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ నేతలకు సెబీ, సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. కానీ విదేశీ సంస్థ హిండెన్‌బర్గ్‌లో వచ్చిన వార్తలపై నమ్మకం ఉందని ఎద్దేవా చేశారు. ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నేతల ధర్నాపై మండిపడ్డ రఘునందన్‌రావు, విదేశీ శక్తులతో రాహుల్‌గాంధీ చేతులు కలిపారని ఆరోపించారు. ప్రధానమంత్రి అవుతానని కలలుకన్న రాహుల్‌గాంధీ, కాకపోయే సరికి వ్యవస్థలను అప్రతిష్ఠ పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
భారత వాణిజ్య వ్యాపారాలను కాంగ్రెస్ దెబ్బతీయాలని అనుకుంటుందా అని రఘునందన్‌రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి హిండెన్ బర్గ్ రాసిందే నమ్మకం అయితే బ్లిట్జ్పైన ఎందుకు నమ్మకం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ చెబుతున్నారని, ఆయనది కాకపోతే డ్రోన్ కెమెరా ఎగరవేసినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు నోటీసులు పంపారని ప్రశ్నించారు. పదవి పోతే హరీశ్‌రావుకు దేవుడు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు.