రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారు: పురందేశ్వరి - Purandeswari Visitlord Venkateswara - PURANDESWARI VISITLORD VENKATESWARA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 6:55 PM IST
BJP Leader Purandeswari Visit in Dwaraka Tirumala: రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామిని కుటుంబ సమేతంగా పురందేశ్వరి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం పలికి స్వామి వారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.
దేవాదాయ శాఖ ఉద్యోగులను ప్రభుత్వం ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునేందుకు భావిస్తుందన్నారు. ఉత్తరాయణంలో పండుగలు ఎక్కువగా ఉండటంతో దేవదాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకుంటే భక్తులు ఇబ్బందులు పడతారని ఆమె పేర్కొన్నారు. వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించి భక్తుల సేవలో ఉపయోగించాలని ఆమె కోరారు. ఇటు రాష్ట్రాభివృద్ధి, అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించిన కూటమి అభ్యర్థులందరికీ ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. దేవాదాయ శాఖ సిబ్బందిని ప్రభుత్వం ఎన్నికల్లో ఉపయోగించకుండా ఈసీ చూడాలని పురందేశ్వరి అన్నారు.