రాష్ట్రంలో మరో రెండు, మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి - maheshwar reddy warns on Land Grab - MAHESHWAR REDDY WARNS ON LAND GRAB
🎬 Watch Now: Feature Video
Published : Mar 28, 2024, 10:45 PM IST
BJP Leader Maheshwar Reddy on Illegal land grabbers : రాష్ట్రంలో మరో రెండు మూడు ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడైనా అక్రమ నిర్మాణాలను బుల్డోజర్తో కూల్చివేస్తామని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని సర్వే నంబర్ 256కు చెందిన ప్రభుత్వ భూమిలో డీమార్ట్ పనులు జరిగాయని, ఇదివరకే పూర్తి ఆధారాలతో కలెక్టర్కు సమర్పించినా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే బీజేపీ ఆధ్వర్యంలో వాటిని బుల్డోజర్తో కూల్చివేస్తామని హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలోని గాజులపేట శివారులో దేవదాయ శాఖకు సంబంధించిన భూమిలో ఒక వర్గానికి చెందిన వారు వెంచర్లు చేసి ప్లాట్ల దందా చేస్తున్నారని, దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరితే ఇప్పటివరకు పట్టించుకోలేదని తెలిపారు.