శ్రీవారి ఆభరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాష్‌రెడ్డి - bjp bhanu prakash reddy comments - BJP BHANU PRAKASH REDDY COMMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 3:36 PM IST
BJP Leader Bhanu Prakash Reddy Comments: తిరుమల క్షేత్రాన్ని వైఎస్సార్సీపీ నేతలు అధర్మ క్షేత్రంగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్ల నుంచి లడ్డూ ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనులన్నింటిలో అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్ధానంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. శ్రీవారి ఆభరణాలు పదిలంగా ఉన్నాయా? లేదా? అనే అనుమానం భక్తుల్లో వ్యక్తమవుతోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వందల కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో దండుకున్నారన్నారు. తిరుమల శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా భక్తులలో కలిగిన అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని అన్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకరరెడ్డిపై తమకు నమ్మకం లేదని భానుప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.