ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు - BJP Celebrations at state office - BJP CELEBRATIONS AT STATE OFFICE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 6:52 PM IST
BJP Celebrations at State Office: మహాకూటమి అభ్యర్ధుల ఘన విజయంపై విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని తాకాయి. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్ధ్‌నాద్ సింగ్ తోపాటు పార్టీ ఇతర నేతలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. బాణసంచా పేలుళ్లు, నృత్యాలతో కేరింతలు కొట్టారు. 2024 విక్టరీ పేరుతో తయారు చేసిన కేక్‌ను సిద్ధార్ధనాథ్‌సింగ్ కట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అంధ్రప్రదేశ్‌లో పార్టీని గెలిపించాయని సిద్ధార్ధ్‌నాథ్ సింగ్ అన్నారు. కన్నడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు. తెలుగు ప్రజలు బీజేపీని మరోసారి ఆశీర్దించారని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని, తద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని సిద్ధార్ధ్‌నాథ్ సింగ్ చెప్పారు. రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేన సంకల్ప పత్రం, బీజేపీ జాతీయ స్తాయిలో మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు.