వివేక హత్య జగన్ దంపతులకు తెలిసే జరిగింది- బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి - Bjp Candidate on Viveka Murder - BJP CANDIDATE ON VIVEKA MURDER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 9:52 PM IST
Bjp Candidate Adinarayana Reddy Comments On YS Jagan: వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ దంపతులకు ముందే తెలుసని జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య చేయించింది అవినాష్ అని సాక్ష్యాలున్నా బుకాయిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం వివేకాను హతమార్చారని, రాజకీయ లబ్ధి కోసమే తనపై నేరారోపణలు చేశారని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. వివేక హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కడప మీడియా సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
Adinarayana Reddy On Vivekanandha Reddy Murder: పథకం ప్రకారమే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, రాజకీయంగా లబ్ధి పొందేందుకే తమపై అభియోగాలు మోపారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. గుండెపోటుగా చిత్రీకరిద్దామని జగన్ దంపతులు అనుకున్నారని పోస్టుమార్టం కోసం వివేక కుటుంబసభ్యులు డిమాండ్ చేయటంతో హత్య అని రుజువు అవుతుందని తనపై నేరారోపణ చేసారని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.