LIVE : బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవం - BJP Vijaya Sankalpa Yatra Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 11:36 AM IST

Updated : Feb 20, 2024, 2:24 PM IST

BJP Bus Yatra Live : పార్లమెంట్ ఎన్నికల సమరశంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మెజార్టీసీట్లలో గెలుపై లక్ష్యంగా కమలదళం ప్రజల వద్దకు వెళ్తోంది. పార్లమెంట్‌ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర విజయసంకల్ప యాత్రలు చేస్తోంది. ఇందులో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్​షోలు నిర్వహించనుంది. అయితే ఈ  యాత్రను బాసరలో యాత్రను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రారంభిస్తున్నారు. తాండూరులో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ప్రారంభిస్తున్నారు. యాదాద్రిలో జరిగే యాత్రను గోవా సీఎం సావంత్​ పాల్గొని ప్రారంభిస్తున్నారు. నారాయణ పేట జిల్లా కృష్ణాలో కేంద్ర మంత్రి రూపాల శ్రీకారం చుడుతోన్నారు. ఈ యాత్ర మార్చి 2 వరకు జరగనుంది. అయితే రాష్ట్రంలో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర ఉన్నందున రెండ్రోజుల ఆలస్యంగా కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు. ఈ ఐదు యాత్రలు ముగింపు సమయానికి విజయ సంకల్ప యాత్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని కిషన్​రెడ్డి తెలిపారు. 

Last Updated : Feb 20, 2024, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.