సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిన వింత జీవి - ఆసక్తిగా గమనించిన స్థానికులు - Big Whale in KP Palem - BIG WHALE IN KP PALEM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 10:53 AM IST

Big Whale in KP Palem :  పశ్చిమగోదావరి జిల్లాలో చేపను పోలిన ఓ వింత జీవి కనిపించింది. నరసాపురం నియోజకవర్గంలోని కేపీపాలెంలో సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఇది సొర చేప ఆకారాన్ని పోలి ఉంది. గత రెండ్రోజులుగా సముద్ర పోటు అధికంగా ఉంది. దీంతో అలల ఉద్ధృతికి ఇది బయటకు వచ్చింది. దీనిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వారు దానిని సముద్ర అలల్లోకి తీసుకెళ్లి వదిలారు. అది ఈదుకుంటూ లోపలికి వెళ్లిపోయింది.

Rare Animal Fish in KP Palem : ఈ వింత జీవిపై భీమవం ఎస్​ఆర్​కేఆర్​ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యులు మట్లపూడి సత్యనారాయణ స్పందించారు. ఇది సొర చేపను పోలిన తిమింగలం జాతి క్షీరదమని అన్నారు. ఇది చేప కాదని జంతువని చెప్పారు. ఇవి పెద్దగా పెరిగే సాధు జంతువులని పేర్కొన్నారు. ఈ జీవులు కూడా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయని తెలిపారు. అటువంటి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మట్లపూడి సత్యనారాయణ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.