మొవ్వ రహదారిపై కుప్పకూలిన భారీ వృక్షం - నిలిచిన రాకపోకలు - Big Tree Fallen on Road - BIG TREE FALLEN ON ROAD
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 6:10 PM IST
Big Tree Fallen on Road in Krishna District : కృష్ణాజిల్లాలో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఓ పెద్ద వృక్షం కూలిపోయింది. కొడలి-మొవ్వ సబ్ స్టేషన్ మార్గ మధ్యలో వృక్షం పడిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలిన భారీ వృక్షాన్ని తొలగించకపోవడంతో కిలో మీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే చల్లపల్లి-పామర్రు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మొవ్వ సబ్ స్టేషన్ ప్రధాన రహదారికి కావడంతో నిత్యం వేల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి. ప్రస్తుతం అక్కడ భారీ వృక్షం కూలిపోవడంతో ఎక్కడికి అక్కడ భారీ వాహనాలు నిలిచిపోయాయి. ద్వి చక్ర వాహనాలు మాత్రం అతి కష్టం మీద ప్రయాణం కొనసాగిస్తున్నాయి. విరిగి పడిన చెట్టు కింద నుంచే ద్వి చక్ర వాహనదారులు ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంత మంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వీలైనంత తొందరగా స్పందించి విరిగిపడిన చెట్టును తొలిగించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.